AP / crime
దగ్గరుండి చంపించాడా..సీసీ టీవీ చెబుతోన్న సంగతి

గుంటూరు ఆరండల్ పేటలో జరిగిన రౌడీ షీటర్ వాసు మర్డర్ సీన్ మొత్తం సీసీ టీవీల్లో రికార్డ్ అయింది. నిత్యం రద్దీగా ఉండే ఆరండల్ పేట 12 వ లైన్ లో ఓ రెస్టారెంట్ లో భోజనం చేసి బయటకు వచ్చిన బసవల వాసుని పక్కా పథకం ప్రకారమే హత్యచేశారన్నది సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే అర్థం అవుతోంది. వాసుతోపాటు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన చైతన్య ఈ వ్యవహారం మొత్తానికి కీలకమన్నది క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తోంది. వాసు ప్రతి కదలికని చైతన్య దుండగులకు సమాచారం ఇచ్చి హత్యకు సహకరించినట్టు ఆ సీన్ ఉంది. దుండగులు అకస్మాత్తుగా వచ్చి వాసుని కారుతో గుద్దినా.. కత్తులు, కొడవళ్లతో నరుకుతున్నా.. చైతన్య ఏమాత్రం కంగారు పడకుండా ఉన్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. స్కార్పియో వాహనం లో వచ్చిన దుండగులు చాలా కసిగా కొడవళ్ళతో వాసును హతమార్చారు. ఇదే ఆ వీడియో..

 

Read Also

 
Related News