India / Entertainment
‘గరుడ వేగ’ లాభాల మాటేంటి?

రాజశేఖర్- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘గరుడ వేగ’. బాగుందని టాక్ రావడంతో వసూళ్లు ఊపందు కున్నాయి. తొలి మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 6.65 కోట్లను రాబట్టినట్టు ట్రేడ్‌వర్గాల సమాచారం. రాజశేఖర్ చిత్రానికి ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ! గరుడ వేగకి ముందు, తర్వాత వచ్చిన సినిమాలు ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోవడంతో బాగానే కలిసొచ్చిందని అంటున్నారు. మరో నాలుగు కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ వుందని బయ్యర్ల అంచనా!

 

ఇదిలావుండగా మూవీ హిట్ కావడంతో శాటిలైట్ రైట్స్‌కి డిమాండ్ పెరిగింది. గరుడవేగని సొంతం చేసుకునేందుకు జీ, జెమినీ ఛానల్స్ పోటీపడుతున్నాయి. ఈ రెండు ఛానళ్లు నాలుగు కోట్ల వరకు వెళ్లినట్టు టాక్. కాకపోతే మేకర్స్ మాత్రం ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. ఇక హిందీలో 2.5 కోట్ల వరకు వెళ్లిందని, కాకపోతే నిర్మాతలు 3.5 కోట్లు కోరుతున్నారని ఫిల్మ్‌సర్కిల్స్ టాక్. ఈ చిత్రానికి 8 నుంచి 10 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ‘గరుడవేగ’ నిర్మాతలు ఫుల్ సేఫ్!

 

Read Also

 
Related News