AP and TS / Entertainment
గురుడ వేగ డైరెక్టర్‌తో కమిటైన నితిన్

‘గరుడ వేగ’ హిట్ కొట్టడంతో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకు ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. చాలామంది యంగ్ హీరోల చూపు ఈ దర్శకుడిపై పడింది. తాజాగా ఈయనతో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు యంగ్ హీరో నితిన్‌. త్వరలో ప్రవీణ్ డైరెక్షన్‌లో డిఫెరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

శ్రేష్ఠ్ మూవీష్ బ్యానర్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు.. పుల్లెల గోపీచంద్ బయోపిక్‌ తో‌పాటు ‘గరుడ వేగ-2’ను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉండటంతో నితిన్-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌ కొంత టైమ్ తీసుకోవచ్చని ఫిల్మ్‌నగర్ సమాచారం.

 

Read Also

 
Related News