AP / crime
పసివాడి ప్రాణం..! ఒక్క చిప్స్ ప్యాకెట్ ఎంత పని చేసింది?

చేప ముల్లు గొంతులో ఇరుక్కుని చనిపోయిన సందర్భాలున్నాయి, చపాతీ ముక్క గొంతుకు అడ్డంపడి ప్రాణం పోగొట్టుకున్నవాళ్ళున్నారు. ఇదే కోవలో మరో పసివాడి ప్రాణం కూడా గాల్లో కలిసిపోయింది. వెస్ట్ గోదావరి జిల్లా కమ్మరిరేవులో జరిగిందీ విషాదం. నిరీక్షణ్‌ కుమార్‌ అనే నాలుగేళ్ల పిల్లాడు తల్లితో కలిసి పాల ప్యాకెట్ కోసం బజారుకెళ్ళాడు. అక్కడ 'డైమండ్ రింగ్స్' చిప్స్ ప్యాకెట్ చూసి కావాలంటూ మారాం చేస్తే.. ఆమె కొనిపెట్టింది.

ఇంటికి వచ్చి ఆ చిప్స్ తింటూ.. పొరపాటున అదే ప్యాకెట్లో వున్న చిన్న బొమ్మను కూడా మింగేశాడు. ఊపిరాడక అల్లాడిపోయాడు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే.. బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పదినిమిషాల ముందువరకూ చలాకీగా వున్న తమ కొడుకు.. ఇంతలోనే శవమై మిగలడంతో ఆ కుటుంబం విషాదంతో నిండిపోయింది.

 

Read Also

 
Related News