AP and TS / General
అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సినిమా సెట్స్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. హుటాహుటీన తరలివచ్చిన నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలుకాలేదని స్టూడియో అధినేత  నాగార్జున అన్నారు. నాన్నగారితో ఎంతో అనుబంధం ఉన్న మనం సినిమా సెట్ కాలిపోవడం బాధాకరమని చెప్పారు. దీనివిలువ దాదాపు రెండు కోట్లవరకూ ఉండవచ్చన్నారు నాగ్.

 

Read Also

 
Related News