AP and TS / Entertainment
జబర్దస్త్ ఆదిపై కత్తి నిప్పులు

తాను జబర్దస్త్ షోను చూడనని.. అది గొప్ప షో అయినా.. అందులో గొప్ప కామెడీ ఉంటుందని తాను అనుకోనన్నారు ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్. మనుషుల మీదా..వారు వేసుకునే బట్టల మీద కామెడీ చేస్తూ అపహాస్యం చేస్తున్న దానిని హాస్యంగా ఎంజాయ్ చేస్తున్నారంటూ విమర్శించారు. జబర్దస్త్ షోలో హైపర్ ఆది వేసిన సెటైర్లపై మహేశ్ మండిపడ్డాడు. దీనికి సంబంధించి టీవీ9లో మహేష్ తన వాదన వినిపించారు. అంతకుముందు తన ఫేస్ బుక్ ఖాతాలో కత్తి మహేష్ ఆదిపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

 

ఇంతకీ కత్తి మహేష్ కు ఇంతకోపం తెచ్చిన హైపర్ ఆది మాటలేంటంటే.. 'పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ మాత్రం.. ముందు పొట్ట వేసుకొని వెనుక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ అంటూ ఆది పంచ్ లు వేసేశాడు. ఈ మాటలే మహేష్‌కు కోపం రప్పించాయి. మెగా ఫ్యామిలీకి ఎవరు ఆపోజిట్‌లో ఉన్నా వాళ్ళే హైపర్ ఆది స్కిట్లో నెక్స్ట్ టార్గెట్ అంటూ మహేష్ విమర్శలు గుప్పించారు.

 

Read Also

 
Related News