AP and TS / Entertainment
నా శరీరంతో ప్రయోగం- అర్జున్‌రెడ్డి

అర్జున్‌రెడ్డి హీరో విజయ్ దేవరకొండ మళ్లీ వార్తల్లోకి వచ్చేశాడు. నా శరీరంతో ప్రయోగం చేస్తున్నానని, ఈ ప్రయోగం ద్వారా
ఏం జరుగుతుందో చూద్దామని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. ట్రైనర్ కులదీప్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. ఇదే
విషయాన్ని ట్రైనర్ కులదీప్ ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ చేశాడు. విజయ్ మరో ఛాలెంజ్‌కు అంగీకరించాడు. 

అర్జున్‌రెడ్డి సిక్స్ ప్యాక్‌ లోకి మారేందుకు, 360 డిగ్రీస్ ఫిట్‌నెస్‌కు అంగీకరించాడని తెలిపాడు. ఈ లెక్కన విజయ్.. తాను చేస్తున్న ప్రాజెక్ట్‌ గురించి ముందుగానే చిన్న హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు ప్రాజెక్టు (మహానటి, సిక్కార్, ఏ మంత్రం వేశావే)లున్నట్లు సమాచారం. ఈ ప్రయోగం.. ఏ ప్రాజెక్ట్‌ కోసం అన్నది చూడాలి.

 

Read Also

 
Related News