India / Entertainment
సెట్స్‌లో హీరో అర్జున్‌పై దాడి

బాలీవుడ్ హీరో అర్జున్‌కపూర్‌కి షాకిచ్చే ఘటన అది. షూటింగ్ చూసేందుకు సెట్స్‌కి వచ్చిన ఓ అభిమాని.. ఏకంగా ఈ హీరోపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు స్టోరీలోకి వెళ్తే.. అర్జున్ కపూర్ లేటెస్ట్ ఫిల్మ్ ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’. ఉత్తరాఖండ్‌లోని పితోరాఘడ్ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతోంది. పీకల దాకా మద్యం తాగి కారులో వచ్చిన డ్రైవరు కమల్‌కుమార్.. అర్జున్‌కపూర్‌ని కలవాలని సెట్స్‌కి వెళ్లాడు.

మద్యం మత్తులో హీరోకి షేక్‌హ్యాండ్ ఇస్తూ ఆకస్మికంగా దాడికి దిగాడు. వెంటనే హీరో పర్సనల్ సిబ్బంది కమల్‌ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక మోటారు వాహనాల చట్టం కింద మద్యం తాగి కారు నడిపిన కమల్‌పై కేసు పెట్టి రూ.500 జరిమానా విధించారు పోలీసులు. అతడి డ్రైవింగ్ లైసెన్సుని రద్దు చేస్తామని ట్రాన్స్‌పోర్ట్ అధికారులు చెబుతున్నమాట.

 

Read Also

 
Related News