AP / crime
పట్టపగలు..నడిరోడ్డుపై..మగమృగ పైశాచికం

విశాఖపట్నంలో పట్టపగలు దారుణం జరిగింది. మద్యం సేవించిన 20ఏళ్ల వ్యక్తి ఫుట్ పాత్ పై ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. రైల్వే న్యూ కాలనీ దగ్గర ఉన్న ఫుట్ పాత్ మీద ఈ ఘటన జరిగింది. బ్లూ కలర్ షర్ట్ ధరించిన వ్యక్తి ఈ అకృత్యానికి పాల్పడ్డట్టు కెమెరాలో రికార్డ్ అయింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అటు వెళ్తున్న జనం కూడా దీనిని పట్టించుకోకపోవడం విచారకరం. అక్కడున్న ఆటో డ్రైవర్ ఈ దృశ్యాల్ని షూట్ చేసి దగ్గర్లోని పోలీస్టేషన్లో ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలి బంధువులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 

Read Also

 
Related News