India / Entertainment
‘ధడక్’ ఆరంభం..జాన్వి, ఈషాన్‌లకు వార్నింగ్

శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ఫస్ట్ మూవీ ‘ధడక్’ షూటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ విషయాన్ని దర్శకనిర్మాత కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇంతవరకు బాగానే వుంది.

సెట్స్‌లో కొన్ని పిక్స్‌ని జాన్వికపూర్, ఇషాన్‌లు కలిసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఈ షేర్ చేసుకున్నారు. ఈ విషయం యూనిట్‌కి తెలియడంతో ఇద్దరికీ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఇకపై అలాంటివి చేయనంటూ క్షమాపణలు చెప్పేశారు. ఇందుకు సంబంధించిన పిక్‌ని డిజైనర్ మనీషామల్హాత్రా అభిమానులతో పంచుకున్నాడు.

 

#udaipur on the sets of @dharmamovies #Dhadak #director @shashankkhaitan with his young actors #ishaankhattar and #jhanvikapoor Having Fun posing for my camera ...trying to pose as a strict director and the two young actors pretending to be scared ... 😊

A post shared by Manish Malhotra (@manishmalhotra05) on

అంతుకుముందు.. రాజస్థాన్‌లోని బర్డ్ విలేజ్ మెనార్‌లో సినిమా షూటింగ్ ఆరంభమైంది. ఇక్కడి బ్రహ్మసాగర్ నది ఒడ్డున గల 52 అడుగుల శివుని విగ్రహానికి తొలుత ఘనంగా పూజలు చేశాడు దర్శకనిర్మాత కరణ్ జోహార్. కూతురుతోపాటు శ్రీదేవి కూడా హాజరైంది. దీనికి సంబంధించి ఇటీవల రిలీజైన ఫస్ట్‌లుక్‌కి సినీలవర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ధర్మా ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఖేతాన్ డైరెక్టర్. 2018 జూలై 6న రిలీజ్‌కి ప్లాన్ చేశారు.

 

#jhanvikapoor s first day of shoot .... #morning #Udaipur #selfie time with @sridevi.kapoor #janvhikapoor both in #manishmalhotralabel #signsture #shawls with #Kashmiri #threadwork on the sets of #Dhadak’ @dharmamovies @karanjohar @shashankkhaitan #ishan #costumedesign #manishmalhotraworld @mmalhotraworld @janhvikapoor_6

A post shared by Manish Malhotra (@manishmalhotra05) on

 

Read Also

 
Related News