India / Entertainment
అందుకోసమే ఆ పని చేస్తున్నా

కాన్సెప్ట్ ఒకటే.. కాకపోతే వ్యక్తులే వేరువేరు.. సేమ్ కాంట్రవర్సీ. నిన్న సన్నీలియోన్ కాగా, ఇవాళ రాఖీ‌సావంత్ వంతైంది. కండోమ్ యాడ్‌లో నటించడాన్ని సమర్థించుకుంటూనే, తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది బాలీవుడ్ హాట్‌గాళ్ రాఖీ. సమాజం సిగ్గుపడే విధంగా తాను వ్యవహరించడం లేదని, సమాజం కోసమే ఇలాంటి పనికి పూనుకున్నా నని అంటోంది.

 

ఇప్పటికీ కండోమ్ గురించి సరైన అవగాహన లేక చాలామంది లైంగిక వ్యాధుల బారిన పడుతున్నారని, వాళ్లకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటోంది. ఈ మాట కొంత వరకూ వాస్తవమే కానీ.. కండోమ్ అమ్మకాలకు మహిళలే బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోవడాన్ని తప్పుపడుతున్నారు కొంతమంది.

 

Read Also

 
Related News