Telangana / Politics
పెద్దల మీద కేసీఆర్ ఆగ్రహం

పెద్దల స‌భ‌కి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆర‌డ‌జ‌ను మంది సీనియ‌ర్ల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేల నియోజ‌కవ‌ర్గాల్లో.. ఎమ్మెల్సీలు జోక్యం చేసుకోవ‌డ‌మే ముఖ్యమంత్రి సీరియస్‌కి కార‌ణ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల బాజిరెడ్డి - భూప‌తిరెడ్డిల మ‌ధ్య వివాదం చివ‌రికి పోలీస్‌స్టేష‌న్ వరకు వెళ్ళిన సంగ‌తి తెలిసిందే!

శాస‌నస‌భ్యులుగావున్న త‌మ‌ని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా శాస‌నమండ‌లి స‌భ్యులు కొన్ని నిధులు తీసుకొచ్చి త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు మొద‌లుపెట్టి హ‌డావిడి చేస్తున్నార‌ని, దీనివ‌ల్ల త‌మ ఇమేజ్ పోవ‌డంతోపాటు పార్టీకి కూడా న‌ష్టం వ‌స్తోంద‌ని ప‌లువురు ఎమ్మెల్యేలు సీఎంకి ఫిర్యాదు చేశారు. ప‌రిస్ధితి సీరియ‌స్‌గా మారుతోంద‌ని గ్రహించిన ముఖ్యమంత్రి ఎవ‌రి ప‌రిధి ఏంటో తెలుసుకుని వ్యవ‌హ‌రించాలంటూ అంద‌రికీ క‌లిపి ఓ క్లాస్ పీకారు.

 

 

Read Also

 
Related News