India / Entertainment
చిరు.. పోరాట యోధుడి లుక్

చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ సైరా నరసింహారెడ్డి. ఎప్పుడో పూజా కార్యక్రమాలు మొదలైనా, ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రస్తుతం రిహార్సల్స్ పనిలో యూనిట్ నిమగ్నమైందట. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి లైఫ్ స్టోరీ కావడంతో కంప్లీట్ పోరాటయోధుడిగా కనిపిస్తున్నాడు చిరంజీవి. ఇందుకోసం భారీగా గెడ్డం కూడా పెంచేశాడు. అందుకు సంబంధించిన ఓ పిక్ బయటకువచ్చింది.

ఇది మెగాస్టార్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ లెక్కన రేపో మాపో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. అచ్చం.. నరసింహా రెడ్డి మాదిరిగానే వున్నాడంటూ అంటున్నారు. మరోవైపు చిరు లుక్.. చెర్రీ రంగస్థలం ఫోటోని పక్కనపక్కన పెట్టి కంపేర్ చేస్తున్నారు.

 

Read Also

 
Related News