AP and TS / Crime
బీ అలర్ట్.. హైదరాబాద్‌లో చెడ్డీ-బనియన్ గ్యాంగ్..!
మోకాళ్ళ దాకా చెడ్డి, గళ్ళ బనియన్లు... సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే సరాసరి దొంగల యూనిఫామ్ ఇది. కానీ.. ఆరోజులు పోయి సైబర్ శకం మొదలైంది. అందరితో పాటు దొంగలూ మారిపోయారు. డ్రెస్ కోడ్ దగ్గరినుంచీ చోరీ పద్ధతుల్లో కూడా మార్పులొచ్చేశాయి. కానీ.. పాత వాసనలున్న కొందరు కరడుగట్టిన దొంగలు కూడా ఇప్పటికీ మన మధ్య తిరుగుతున్నారు. ఇదిగో.. ఇప్పుడు మళ్ళీ చెడ్డి-బనియన్ గ్యాంగ్ పేరుతో ఒక ఘరానా దొంగల ముఠా హైదరాబాద్ లో సంచరిస్తోందన్నది బ్రేకింగ్ న్యూస్. పొట్టి నిక్కర్, రంగు బనీన్లు వేసుకుని, విప్పిన చొక్కా నడుంకి చుట్టుకుని అనుమానాస్పదంగా ఎవరు తిరిగినా.. వాళ్ళే 'చెడ్డి-బనియన్' గ్యాంగ్ అట! పట్టుకుంటే చేతికి దొరక్కుండా జారిపొయ్యేందుకు వంటి నిండా చమురు పూసుకుంటారు. నగర శివార్లలో కట్టుకున్న ఖరీదైన ఇండివిడ్యువల్ ఇళ్ళు.. వీళ్ళ టార్గెట్లు!
సైబరాబాద్ పోలీసులు దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. ఈ తరహా డ్రెస్ కోడ్ తో ఎవ్వరు కనిపించినా అప్రమత్తం కావాలని, వెంటనే సమాచారం అందివ్వాలని నగర జనాభాకు అప్పీల్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక్కరిగా గానీ, విడివిడిగా గానీ తిరుగుతూ పగలు టార్గెట్ ఫిక్స్ చేసుకుని రాత్రుళ్ళు ఎటాక్ చేస్తారట. ఇంట్లోకి జొరబడి.. ఎదురు తిరిగినవాళ్ళను కత్తులతో నరకడం.. దొరికినంతా దోచుకుని.. అక్కడే తిని ఇల్లంతా గబ్బుచేసి వెళ్లడం ఈ చెడ్డి బనియన్ గ్యాంగ్ పద్దతి. సమాచారం అందివ్వడంలో జనం సహకరిస్తే.. వాళ్ళను పట్టుకుని సిటీకి రిలీఫ్ నిస్తామని సైబరాబాద్ డీసీపీ విశ్వప్రసాద్ చెబుతున్నారు. 
 

Read Also

 
Related News