AP / Politics
పవన్ కామెంట్స్‌కి బాబు రియాక్షన్

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తలెత్తుతున్న విమర్శలపై సీఎం చంద్రబాబు సూటిగా స్పందించారు. నిర్మాణం విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు..దీనిపై అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి రిప్రజంటేషన్ ఇస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. మూడునెలలపాటు పనులు ఆగిపోయిన మాట వాస్తవమేనని, తాను మాత్రం ప్రతీ సోమవారం పోలవరం వారంగానే పరిగణిస్తూ సిన్సియర్‌గా పనిచేస్తున్నామన్నారు.

కొరియా టూర్‌ని ముగించుకుని తిరిగొచ్చిన చంద్రబాబు, మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాల్ని ప్రస్తావించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో టచ్‌లోనే వున్నానన్న చంద్రబాబు.. పోలవరంపై ఓ మెట్టు దిగినట్టే కనిపించారు. పవన్ లాంటివాళ్లు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని భావిస్తుంటే.. వైసీపీలాంటి పక్షాలు మాత్రం ప్రాజెక్టుని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్న డిమాండ్‌ మీద మాత్రం సూటిగా స్పందించలేదు.

 

Read Also

 
Related News