Telangana / Politics
ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం: సీఎం

రైతులకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. బ్యారేజీలు, పంప్ హౌజ్‌లు, కాలువల నిర్మాణం ఏక కాలంలో మూడు షిప్టుల్లో పనులు జరగాలని అధికారులను, వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించి పనులను సీఎం పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కేసీఆర్ మొదట మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా కన్నెపల్లి పంప్ హౌజ్ వద్దకు చేరుకుని అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం అన్నారం బ్యారేజీ దగ్గర రెండో ఆనకట్ట పనులను పరిశీలించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్‌ల పనులు చూస్తున్న కేసీఆర్, ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. పక్క రాష్ట్రాల అధికారులతో పోలీస్ శాఖకు సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలని డీజీపీకి కేసీఆర్ సూచించారు. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, ఈటలరాజేందర్, చీఫ్‌ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు వినోద్, బాల్కసుమన్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర అధికారులున్నారు.

 

Read Also

 
Related News