Telangana / Politics
2018 నుంచి కొత్త చరిత్ర : కేసీఆర్

2018, జనవరి 1 నుంచి తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేసి రాష్ర్ట ముఖచిత్రం మారుస్తామన్నారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేందుకే రైతు సమన్వయ సమితుల ఏర్పాటని తెలిపారు.

వ్యాపారుల వద్ద గిట్టుబాటు ధర లభించకపోతే పంటను రైతు సమన్వయ సమితులు కొంటాయన్నారు. భూరికార్డులతో రైతు సమన్వయ సమితులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూసారం, వాతావరణంపై అధ్యయనం చేసి క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత రైతులకేనని.. కౌలురైతులకు కాదని సీఎం అన్నారు. కౌలుదారు చట్టం చాలా ప్రమాదకరమైందని.. కౌలుదారు పేరుతో అసలుదారు మునగడం తమకు ఇష్టం లేదని కేసీఆర్ వెల్లడించారు.

 

Read Also

 
Related News