India / Entertainment
బాలీవుడ్ ‘టెంపర్’ బయటికొచ్చాడు

బాలీవుడ్ ‘టెంపర్’ బయటికొచ్చాడు. ఇందులో ఎన్టీఆర్ రోల్‌ని నటుడు రణవీర్‌సింగ్ చేస్తున్నాడు. దీనికి ‘సింబా’ అన్న టైటిల్ ఓకే చేస్తూ.. ఫస్ట్ లుక్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ర‌ణ్‌వీర్.. సంగ్రామ్‌ భలేరావ్‌ రోల్‌లో కనిపిస్తున్నాడు. టాలీవుడ్‌‌లో హిట్టయిన ‘టెంపర్’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2018 ఆరంభంలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ర‌ణ్‌వీర్ సింగ్ పక్కన హీరోయిన్‌గా జాన్విక‌పూర్‌ని ఎంపిక చేసే ఛాన్స్ వుందని సమాచారం. ధర్మ ప్రొడక్షన్స్‌- రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌- ఆర్‌ఎస్‌ పిక్చర్స్‌ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

Read Also

 
Related News