India / General
'ఎంజీఆర్' బయోపిక్, తమిళనాడు సీఎం క్లాప్!

ఇక్కడ ఎన్టీయార్ బయోపిక్ వార్ వేడెక్కిపోతే.. అటు తమిళనాట కూడా ఇటువంటి సీజనే ఇంకోటి మొదలైపోయింది. సినిమా హీరోగా అంతులేని జనాకర్షణ పొంది, రాజకీయాల్లోకొచ్చి సీఎం కుర్చీనెక్కి సంచలనం సృష్టించిన ఎంజీ రామచంద్రన్ జీవిత చరిత్ర మీద కూడా ఒక బయోపిక్ రెడీ అవుతోంది. 'ఎంజీఆర్' టైటిల్ మీద చెన్నైలో షూటింగ్ కూడా షురూ అయింది. ముహూర్తం షాట్ కి తమిళనాడు సీఎం పళనిస్వామి క్లాప్ కొట్టారు. బాలకృష్ణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రను వర్ధమాన నటుడు సతీష్ పోషిస్తున్నాడు. ఎంజీఆర్ జయంతి సందర్భంగా జనవరి 17న టీజర్ రిలీజ్ కానుందట! ఎంజీఆర్ 'సహచరి' జయలలిత మరణం నేపథ్యంలో.. అన్నాడీఎంకే చీలిపోయిన ఈ సందర్భంలో 'ఎంజీఆర్' సెంటిమెంట్ ను మళ్ళీ వాడుకోవాలన్నది ఆ పార్టీ ఉద్దేశం కావొచ్చు .

 

Read Also

 
Related News