AP and TS / Entertainment
నవంబర్‌లో ‘జైసింహా’ విశ్వరూపం

బాలకృష్ణ- నయనతార జంటగా రానున్న మూవీ ‘జై సింహా’. విడుదలకు మరో రెండునెలలు మాత్రమే వుండడంతో ఈ ప్రాజెక్ట్
కి సంబంధించి హంగామా మొదలైంది. ఇందులోభాగంగా ఫస్ట్‌లుక్ నవంబర్ 1న, సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి
12న థియేటర్స్‌కి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

హైదరాబాద్‌తోపాటు తమిళనాడులోనూ కీలక షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. నవంబర్ చివరకు దాదాపు టాకీ పూర్తికానుండగా, అప్పటికి రెండు పాటల చిత్రీకరణ పెండింగ్‌లో వుండనుంది. కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నయనతారతోపాటు కన్నడ బ్యూటీ హరిప్రియ, మళయాళం నటి నతాశా దోషి నటిస్తున్నారు.

 

Read Also

 
Related News