AP and TS / Entertainment
బాలయ్య - కృష్ణారెడ్డి ఫాంటసీ ఫిల్మ్!

హిట్ ఫట్‌లతో సంబంధం లేకుండా సీనియర్ స్టార్స్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు బాలకృష్ణ. జైసింహా తర్వాత చేయాల్సిన ఎన్టీఆర్ బయోపిక్‌కు ఇంకొంత టైమ్ పట్టేలా ఉండడంతో ఈలోగా ఎస్‌వీ కృష్ణారెడ్డి‌తో ఓ మూవీ చేయడానికి కమిటయ్యాడట బాలయ్య. రీసెంట్‌గా బాల‌య్యని క‌లిసిన కృష్ణారెడ్డి తనదగ్గరున్న స్టోరీని వినిపించాడు. దానికి ఇంప్రెస్ అయిన ఈ హీరో.. గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని సమాచారం. జనవరి‌లో ముహూర్తం జరిగే ఈ ప్రాజెక్ట్.. ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుందని ఇన్‌సైడ్ సమాచారం. నాలుగైదు నెలల్లో పూర్తయ్యేలా ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నట్టు టాక్. ఆ త‌ర్వాత బాలకృష్ణ- బోయ‌పాటి కాంబో మొదలుకానుంది.

 

Read Also

 
Related News