బాహుబలి తరహా స్టంట్.. ఎత్తి కుదేసిన ఏనుగు

సినిమాల్లో మాదిరిగానే స్టంట్స్ చేయాలని ఒక్కోసారి యువత ఆలోచన చేస్తుంది. బాహుబలి 2లో ఏనుగుకి ప్రభాస్
ముద్దుపెట్టి ఆపై తొండంపై ఎక్కి కుంభస్థలం మీద కూర్చునే షాట్ ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యింది. ఆ సీన్‌ను రియల్‌గా చేయాలని ప్లాన్ చేశాడు ఓ కేరళ యువకుడు. 

.. తొలుత ఏనుగుకి అరటిపండు ఇచ్చాడు. ఆ తర్వాత ఏనుగు తలపై ముద్దుపెట్టాడు.. అంతటితో ఆగకుండా మెల్లగా దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇంకేముంది.. ఒక్కసారిగా యువకుడ్ని పైకి లేపి విసిరికొట్టింది ఏనుగు. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరి అల్లంత దూరంలో పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ తతంగాన్ని వీడియో తీసిన మరో యువకుడు.. ఫ్రెండ్‌ని ఏనుగు నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించాడు. అతడికి ట్రీట్‌మెంట్ చేస్తున్నారు డాక్టర్లు. కేరళలోని ఇడుక్కి థోడుపూఝా ప్రాంతంలో  జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Related News