AP / general news
బోటు ఘటనకు ముందు ఏం జరిగింది?

కృష్ణానదిలో పడవ ఘటనకు ముందు పెద్ద తతంగమే జరిగింది. ఆదివారం కావడం, టూరిస్టుల అధికంగా రావడంతో రద్దీ పెరిగింది. దుర్గా ఘాట్ నుంచి బోటును నడిపేందుకు ప్రైవేటు సంస్థ ప్రయత్నించగా, ఏపీ టూరిజం అధికారి అడ్డుకున్నారు. అక్కడ బోటు నిలపడానికి కూడా వీల్లేదని, ప్రయాణికులను ఎక్కించుకోవడానికి అనుమతిలేదని స్పష్టంచేశారు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఆయన సదరు బోటు నిర్వాహకులను విజ్ఞప్తి చేశారు.

ప్రయాణికులను ఎక్కించుకోవడానికి తమ బోట్లు ఉన్నాయని, మీరు వెళ్లిపోవాలంటూ కోరారు. లేకపోతే బోటును ఇక్కడ నుంచి బలవంతంగా పంపించేస్తామంటూ హెచ్చరించారు. దీంతో, డ్రైవర్ బోటును తీసుకుని వెళ్లిపోయాడు. ఇది జరిగిన కాసేపటికే అదే బోటు.. భవానీ ఐలాండ్ నుంచి పవిత్ర సంగమంకు పర్యాటకులను ఎక్కించుకుని బయల్దేరింది. టూరిజం అధికారి హెచ్చరించినా లెక్క చేయకుండా ప్రయాణికులను ఎక్కించుకుని, వాళ్ల జీవితాలతో ఆడుకుంది.

 

Read Also

 
Related News