AP / Entertainment
అవార్డులపై చిరు, రజనీ, కమల్ ఏమన్నారు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, రఘుపతి వెంకయ్య అవార్డు ప్రకటించడం పట్ల సూపర్‌స్టార్
రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ అవార్డు తనకు రావడం చాలా ఆనందంగా ఉందని రజనీకాంత్ ట్వీట్ చేశాడు.

తెలుగు తెరతో ఎంతో అనుబంధం ఉన్న కమల్‌హాసన్ కూడా ఎన్టీఆర్ పురస్కారం రావడం పట్ల ఆనందం వ్యక్తం‌చేశాడు. 2016 ఏడాదికి ఎన్టీఆర్‌ పురస్కారం అందుకొంటున్న రజనీకాంత్‌కి శుభాకాంక్షలు... ఆ పురస్కారంతో తనను గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు కమల్. తన కెరీర్‌ ఆరంభం నుంచి మద్దతునిస్తున్నందుకు రుణపడి ఉంటానని ట్వీట్‌ చేశాడు.

మరోవైపు రఘుపతి వెంకయ్య అవార్డుకి తాను ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు చిరంజీవి. ఓ గొప్ప వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డుకి తనను ఎంపిక చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, జ్యూరికీ తన కృతజ్ఞతలు చెప్పారు.

 

Read Also

 
Related News