India / Entertainment
స్కూల్ సిలబస్‌లో శ్రీదేవి సినిమాలు.. కొత్త ప్రయోగం!
ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ శ్రీదేవి.. మరో అరుదైన క్రెడిట్ కొట్టేసింది. అతిలోక సుందరిగా నార్త్, సౌత్ ఇండస్ట్రీస్ ని ఒక ఆట ఆడేసుకున్న శ్రీదేవి సినిమాలు చరిత్రలో కలిసిపోవాల్సిదేనా? రాబోయే తరాలకు శ్రీదేవితో అవసరం వుండబోదా? అందుకే.. శ్రీదేవి ఫిల్మీ కెరీర్ ఒక పాఠ్యాంశంగా వచ్చేస్తోంది. రెగ్యులర్ అకడమిక్ సిలబస్ లో కాదండోయ్.. ఇక్కడ మాట్లాడుకుంటోంది... యాక్టింగ్ స్కూల్ పుస్తకాల సంగతి! 
గ్లామర్ స్టార్ శ్రీదేవి ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ లో పడిపోయింది. అయినా.. ఆమె అందంలో ఆ కరకు మాత్రం మాసిపోలేదు. ఇప్పటికీ ఆమె పువ్వులాగే ఉందంటూ రామ్ గోపాల్ వర్మ లాంటి హార్డ్ కోర్ ఫాన్స్ చెబుతుంటారు. నటనకు, గ్లామర్ కు మారుపేరుగా నిలబడిపోయిన శ్రీదేవిని ముందు పెట్టుకుని నేర్చుకుంటే నటన దానంతటదే వస్తుందని అనీష్ నాయర్ అనే ఒక అభిమాని భావించాడు. అలా అనుకున్నాడో లేదో వెంటనే ఒక యాక్టింగ్ స్కూల్ మొదలుపెడదామని ఫిక్సయ్యాడు. శ్రీదేవిని, ఆమె టీంని సంప్రదించి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నాడు 
 
ఆ స్కూల్ లో ఒక సూపర్ స్పెషాలిటీ ఏమిటంటే .. శ్రీదేవి సినిమాలు. శ్రీదేవి నటించిన కొన్ని అజరామర చిత్రాల్ని సిలబస్ లో పెట్టి.. వాటి ద్వారా యాక్టింగ్ నేర్పించాలన్నది అతడి ప్లాన్. మొదటగా చెన్నైలో ప్రారంభమయిన అనీష్ యాక్టింగ్ స్కూల్.. తర్వాత హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్ కతాల్లో బ్రాంచీలు తెరుస్తుంది. సామాజికంగా వెనుకబడ్డ యువతీయువకులకు ఉచితంగా నటన నేర్పించాలన్నది ఇతడి మరో ఆశయమట. 
 

Read Also

 
Related News