India / Entertainment
అమలాపాల్‌కి ‘కారు’ చిక్కులు

హీరోయిన్ అమలాపాల్ వార్తల్లోకి వచ్చేసింది. ఆమె కారు వ్యవహారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విచారణకు
ఆదేశించారు. గతేడాది పుదుచ్చేరిలో ఓ లగ్జరీ కారుని రూ.1.12 కోట్లకు కొనుగోలు చేసింది అమలాపాల్ . ఈ కారుని ఆమె సొంత రాష్ట్రం కేరళలో రిజిస్ట్రేషన్ చేయించాలంటే రూ.20 లక్షలు పన్ను చెల్లించాల్సిందని భావించిన ఈ అమ్మడు.. పుదుచ్చేరిలోనే ఫేక్ చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించి.. కేరళలో వినియోగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఈ వ్యవహారం చివరకు లెఫ్టినెంట్ గవర్నర్ చెవిలోపడింది. కారు వ్యవహారంపై విచారణ చేసి నిజానిజాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు పుదుచ్చేరి గవర్నర్‌ . దీంతో ఆమెని విచారించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.

 

Read Also

 
Related News