AP and TS / Entertainment
ఠాకూర్‌తో బన్నీకి గొడవేంటి?

అల్లుఅర్జున్- అను ఇమ్మాన్యుయేల్ జంటగా రానున్న మూవీ ‘నా పేరు సూర్య’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించి కొన్ని పిక్స్ బయటకు‌వచ్చాయి. సోమవారం నుంచి హైదరాబాద్‌లో జరుగుతున్న షూట్ నటుడు ఠాకూర్ అనూప్‌సింగ్ జాయిన్ అయ్యాడు.

బన్నీ- ఠాకూర్‌ల మధ్య హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ని డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించాడు. సన్నివేశాలను అనుకున్న దానికంటే బాగా రావడంతో యూనిట్ ఫుల్‌ఖుషీ. మూవీకే ఇవి అత్యంత కీలకమైన సీన్స్ అని అంటున్నారు.

ఈ పిక్స్ బయటకు రాగానే ఇంతకీ ఠాకూర్‌తో బన్నీకి గొడవేంటి? వీళ్లిద్దరి మధ్య బిజినెస్ ఫైటా? మరేంటి అంటూ ప్రశ్నించడం హార్డ్‌కోర్ ఫ్యాన్స్ వంతైంది. యాక్షన్‌సింగ్ అర్జున్, శరత్‌కుమార్‌లు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 27న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 

Read Also

 
Related News