AP and TS / Entertainment
‘అజ్ఞాతవాసి’కి అంత సీన్ లేదు!

‘అజ్ఞాతవాసి’ అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతోందని.. భారత సినీ చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా 209 థియేటర్లలో విడుదలౌతోందని తాజాగా ఒక పోస్టర్ వచ్చింది. ‘అజ్ఞాతవాసి’ రిలీజ్ కు సంబంధించి ఓవర్సీస్ డిస్టిబ్యూటర్స్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు తిరగరాసిన బాహుబలిని మించి ‘అజ్ఞాతవాసి’ యూఎస్ లో రిలీజ్ అవుతుందా అని అందరిలోనూ ఒక విధమైన ఆసక్తిని రేకెత్తించింది ఈ పోస్టర్. అయితే, నిజానికి బాహుబలి కంటే ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కావడంలేదు. ఇక్కడ పీవీఆర్, సినీమ్యాక్స్ వలే అమెరికాలో ఉన్న 'సినీ మార్క్' అనే ఒక చైన్ ఆఫ్ థియేటర్స్ లలో మాత్రమే ఇది ఒక రికార్డు. సినీమార్క్ చరిత్రలో 209 థియేటర్లలో ఒక తెలుగుసినిమా రిలీజ్ కావడం రికార్డే కావచ్చు. కాని అది బాహుబలి కంటే ఎక్కువ థియేటర్లలో అమెరికాలో రిలీజ్ అవుతోందనుకోవడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో క్లారిఫికేషన్స్ వస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’కి అంతసీన్ లేదని బాహుబలి అమెరికాలో 800లకు పైగా థియేటర్స్ లలో రిలీజ్ అయిందనే వివరణలకు కూడా సోషల్ మీడియా వేదికైంది.. ఇదీ సంగతి.

 

Read Also

 
Related News