India / Entertainment
ఐష్, ఆరాధ్య.. కౌంటరిచ్చిన అభిషేక్

సినీ లవర్స్, నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌పై ఓ వైపు మండిపడుతూనే.. మరోవైపు కూల్‌గా రిప్లై ఇచ్చేశాడు హీరో అభిషేక్‌ బచ్చన్. వీకెండ్‌లో అన్ని స్కూల్స్‌కి హాలీడేస్ వుంటాయని, మిగతారోజుల్లో ఆరాధ్య తప్పకుండా పాఠశాలకు వెళ్తుందన్నాడు. మా వైపు నుండి ఎలాంటి త‌ప్పులేదని, మీ ట్వీట్స్‌లోనే త‌ప్పు ఉందేమో చూసుకోండంటూ కౌంట‌రిచ్చాడు.

అసలేం జరిగిందంటే.. ఇటీవల ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్య, తల్లి వ్రిందారాయ్‌తో కలిసి కజిన్ మ్యారేజ్‌కి వెళ్లింది. అక్కడ ఐష్ ఫ్యామిలీయే హైలైట్. మంగ‌ళూరులో జ‌రిగిన మ్యారేజ్ వేడుక‌కు ఐశ్వర్యరాయ్ గోల్డ్ ఎంబ్రాయిడ‌రీతోవున్న రెడ్ కలర్ లెహంగాని ధ‌రిస్తే, ఆరాధ్య కూడా అదే కలర్ డ్రెస్‌తో ద‌ర్శన‌మిచ్చింది.

 

Namma Oorda Beauty Queen Aishwarya Rai Spotted last night in a wedding reception at TMA Pai conventional centre 😍❤ #Mangalore #Mangaluru #AishwaryaRai #Tmapai

A post shared by Mangalore Meri Jaan (@mangaloremerijaan) on

తల్లీకూతురు ఒకే డ్రెస్‌లో క‌నిపించిన పిక్స్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై కొంద‌రు పాజిటివ్‌గా.. మ‌రికొంద‌రు నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఐతే, ఓ మ‌హిళ.. ఆరాధ్య గురించి ఓ ట్వీట్ చేసింది. ఆరాధ్య స్కూల్‌కి వెళ్లదా?ఎప్పుడు చూసినా త‌ల్లితో క‌లిసి షికారు చేస్తున్నట్లు కనిపిస్తుందని, స్కూల్ యాజ‌మాన్యం అన్ని సెల‌వులు ఎలా ఇస్తున్నారు? మీ అమ్మాయికి చ‌దువు అక్కర్లేద‌ని అనుకుంటున్నారా  అంటూ ట్వీట్ చేసిన విషయం తెల్సిందే!

 

With @Theshilpashetty

A post shared by Aishwarya Rai Bachchan (@aishwaryaarai) on

 

 

Read Also

 
Related News