India / Politics
యూపీ సీఎం యోగీని పెళ్లాడి కసి తీర్చుకుంది

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని పెళ్లాడి కసితీర్చుకుందో మహిళ. యోగి అదిత్యనాథ్‌ బ్రహ్మచారి కావడంతో ఆడవాళ్ల సమస్యలు అస్సలు అర్థం కావడం లేదని...అందుకే పెళ్లాడాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. యూపీ సీఎం.. అందులోనూ యోగి.. ఇదేంటి ఈ పెళ్లితంతు మరీ వింతగా ఉందే అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే. కాకపోతే డైరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ ను కాకుండా ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది సదరు మహిళ. ఇక పాయింట్ లోకి వచ్చేస్తే.. యూపీలో అంగన్‌వాడీ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. సీతాపూర్‌లోని అంగన్‌వాడీ మహిళలంతా కలిసి ఇవాళ సీఎం యోగి విగ్రహానికి వివాహం చేశారు. జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్‌ అధ్యక్షురాలు నీతు సింగ్‌ పూలమాల వేసి సీఎం యోగి ని వరించినట్లు తెలిపారు. ఈ వివాహం వల్ల రాష్ట్రంలోని నాలుగు లక్షల అంగన్‌వాడీ సోదరీమణులకు మేలు జరుగుతుందని ఆమె చెప్పారు. యోగీకి పెళ్లయి, భార్యవుంటే తమ సమస్యలు అర్థమయ్యేవనీ.. అందుకే పెళ్లి చేశామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కొంతకాలంగా ఉత్తరప్రదేశ్‌లో అంగన్‌వాడీ ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు. అయినా యోగీ సర్కారునుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇలా పెళ్లికి తెరతీశారు. ఈ రకంగానైనా బ్రహ్మచారి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పెళ్లికొడుకయ్యే భాగ్యం తక్కిందన్నమాట.

 

Read Also

 
Related News