Telangana / Crime
మహిళా హోంగార్డ్‌తో ఏఎస్‌ఐ మసాజ్

సరూర్ నగర్ సీఐ లింగయ్య సైదానాయక్ అనే కానిస్టేబుల్‌తో మసాజ్ చేయించుకున్న బాగోతం మరువక ముందే మరో మసేజ్ ఉదతం బయటపడింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ మహిళా హోంగార్డ్‌తో ఏఎస్‌ఐ మసాజ్ చేయించుకుంటూ మీడియాకు చిక్కాడు. గద్వాలలో సాయుధ రిజర్వు ఏఎస్‌ఐగా పనిచేస్తున్న హసన్.. మహిళా హోంగార్డ్‌తో మసాజ్ చేయించుకుంటూ కెమెరాకు దొరికిపోయాడు. మీడియాను గమనించిన హసన్ కంగారుగా బయటకు వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై రహస్యంగా విచారణ జరిపించాలంటూ ఎస్పీ విజయ్‌కుమార్ ఆదేశించారు. కాగా, సీఐ లింగయ్య మసాజ్ వ్యవహారంపై అప్పట్లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తి విచారణకు ఆదేశిస్తూ లింగయ్యను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Read Also

 
Related News