కృష్ణానది బోటు ఘటన.. తొలి వేటు ఆ ఉద్యోగిపై..

కృష్ణానదిలో జరిగిన బోటు దుర్ఘటనకు సంబంధించి అధికారులపై చర్యలు వేగవంతమయ్యాయి. ఏపీ టూరిజంలో డ్రైవర్ గా పనిచేస్తున్న గేదెల శ్రీనుని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ‘రివర్ బోటింగ్ అండ్ అడ్వెంచర్స్’ సంస్థను శ్రీను నడుపుతున్నాడని భావించిన టూరిజం శాఖ అధికారులు.. మూడునెలల కిందట అతడ్ని నెల్లూరు జిల్లా తడకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇతగాడికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు టూరిజం శాఖ డైరెక్టర్ శుక్లా.

 

ఇటు రివర్ బోటింగ్ సంస్థలో పెట్టుబడులు పెట్టాడని భావించిన భవాని ఐలాండ్ మేనేజర్ శ్రీధర్‌ని కూడా ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రస్తుతం కొల్లి శ్రీధర్‌పైనా విచారణ జరుగుతోంది. ఐతే, పెద్దవాళ్లను వదిలి దిగువ‌స్థాయి ఉద్యోగులపై వేటు వేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమాదానికి బాధ్యులైన ఇతరులను కూడా అరెస్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.

కాగా, పడవ ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. ఒంగోలుకు చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు ఆదివారం ఒంగోలు నుంచి 60 మంది రెండు ప్రైవేటు బస్సుల్లో విజయవాడకు వచ్చారు. పవిత్ర సంగమం వద్ద హారతి చూసేందుకు వెళ్తూ పడవ బోల్తా పడిన విషయం తెల్సిందే!

Related News