AP / crime
అతడు పాస్టర్ కాదు రేపిస్ట్.. ప్రార్థన పేరుతో బలాత్కారం..

చర్చిని అడ్డుపెట్టుకుని మహిళల జీవితాలతో ఎబినెజర్ ఆడుకుంటున్నాడని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఏపీ డేరాబాబాగా ఎబినెజర్ అవతారమెత్తాడని ఆమె అన్నారు. వెంటనే కామాంధుడు ఎబినెజర్ ను అరెస్ట్ చేయాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురంలో ఎబినెజర్ బాధితులను రాజకుమారి ఇవాళ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎబినెజర్ భార్యతోపాటు, మరికొందరు బాధితులు తమకు జరిగిన అన్యాయాల్ని రాజకుమారి దగ్గర మొరపెట్టుకున్నారు. చర్చిలో ప్రార్థనలకు తీసుకెళ్లి తమ ఆడపిల్లల్ని ఇప్పటివరకూ ఇంటికి పంపలేదని కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు నన్నపనేని దగ్గర ఫిర్యాదు చేశారు. ఎబినెజర్ ను తక్షణమే అరెస్ట్ చేయమని నన్నపనేని రాజకుమారి ఎస్పీకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని కోరారు.

 

Read Also

 
Related News