AP and TS / Entertainment
ఈసారి గురి తప్పదు.. కాచుకోండి - అఖిల్ అక్కినేని

టాలీవుడ్ సిసింద్రీకి లైఫ్ ఎప్పుడొస్తుందో తెలీదు గానీ.. ఇప్పటికైతే మూడొచ్చింది. మూడంటే ఏదో మూడనుకునేరు.. ఇది వేరే మూడు. ముచ్చటగా మూడు కోట్లు! విషయంలోకి వెళితే.. అఖిల్ తన రెండో వెంచర్ 'హలో' షూట్స్ లో బిజీగా వున్నాడు. దాని మార్కెటింగ్ పనుల్లో కూడా జోష్ పెరిగింది. డెబ్యూ మూవీ డిజాస్టర్ కావడంతో.. రెండో ప్రాజెక్ట్ మార్కెట్ సైజు మీద ఇప్పటిదాకా సందేహాలుండేవి. కానీ.. అవి ఉత్తుత్తి అనుమానాలేనని, అఖిల్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని సంకేతాలొస్తున్నాయి.

ఒక్క గుంటూరు జిల్లా హక్కులే మూడు కోట్లకు అమ్ముడైనట్లు సమాచారముంది. ఎస్వీ సినిమాస్ ఈ రైట్స్ ని సొంతం చేసుకుందట. ఏదైతేనేం అఖిల్ 'హలో' ఎట్టకేలకు బోణీ కొట్టిందన్న మాట! నాగార్జున సొంతంగా తీస్తున్న 'హలో' మూవీ ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజై ప్రాజెక్ట్ కి మంచి ఊపునిచ్చింది. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ఇందులో హీరోయిన్. ఇదిలా ఉంటే.. తన 'హలో' మూవీపై మరింత క్లారిటీ ఇచ్చాడు అఖిల్. ఈ మంగళవారం 'హలో'కు సంబంధించి ఒక సర్ ప్రైజ్ ఉంటుందని, సినిమా కూడా డిసెంబర్ 22న విడుదల కావడం ఖాయమని ట్వీట్ చేశాడు.

 

Read Also

 
Related News