AP / crime
దేవరగట్టు.. తలలు పగులగొట్టు

కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం పేరిట జరిగే ఉత్సవంలో అనేకమంది తలలు పగిలాయి. విజయదశమి నాడు రాత్రివేళ జరిగిన కర్రల సమరంలో ఈరన్న అనే వ్యక్తి మరణించగా.. సుమారు 60 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు.

మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలో మాళమ్మ, మల్లేశ్వర్ లకు విజయదశమి రోజు రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్నగుడి ప్రాంతాల్లో కాగడాల వెలుతురులో విగ్రాహాలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవ మూర్తులను దక్కించుకోవడానికి మూడు గ్రామాలవారు ఓ వర్గంగా, ఐదు గ్రామాల వారు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో కొట్టుకుంటారు. పోలీసులు ఈ ఏడాది కూడా ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఈ సమరాన్ని ఆపలేకపోయారు.

 

Read Also

 
Related News