World / Crime
అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి టార్గెట్..

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్‌పై దుండగుడు విరుచుకుపడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదురుగు మృతిచెందగా, పదిమంది గాయపడినట్టు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఎలా జరిగింది? లోతుగా వెళ్తే..

ఉత్తర కాలిఫోర్నియాలోని రెడ్‌బ్లఫ్ రూరల్ ఏరియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్‌లోకి కెవిన్ అనే దుండగుడు చొరబడి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ల శబ్దాలతో పాఠశాల ఆవరణ మారుమోగిపోయింది. భయాందోళనలతో విద్యార్థులు, టీచర్లు తరగతి గదుల్లోని డెస్కులు, బెంచ్‌ల కింద తలదాచుకున్నారు. దీంతో అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది.. ఫైర్ ఎక్స్టింగ్విషర్‌తో దుండగుడ్ని దారి మళ్లించారు. దీంతో దారిమళ్లిన కెవిన్.. స్కూల్ నుంచి బయటపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాల్పులు జరపడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అతడ్ని మట్టుబెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

 

 

Read Also

 
Related News