సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినే అభిశంసించాలా ?

దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యున్నత న్యాయస్థానం..సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు శుక్రవారం మీడియా ముందుకొచ్చారు. విధిలేని పరిస్థితుల్లోనే తాము ఇలా మీ ముందుకు వచ్చామని చెప్పిన వీరు..తమ చీఫ్ జస్టిస్ తీరుపైనే బాహాటంగా అసంతృప్తిని వెలిగక్కడం విడ్డూరం. న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియెన్ జోసెఫ్.. ఈ అత్యున్నత న్యాయస్థాన పాలనా విధానం సరిగా లేదని పేర్కొన్నారు. ఈ న్యాయ వ్యవస్థ సరిగా లేకపోతే ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య వ్యవస్థకే మనుగడ లేదని జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు. సీనియర్ జడ్జీలైన తాము కొని అంశాలకు పరిష్కార మార్గాలు చూపమని కొన్ని నెలలుగా చీఫ్ జస్టిస్ ను కోరుతూ వచ్చామని, అయితే ఆయన నుంచి సానుకూల స్పందన లేదని తెలిపారు.

ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలా అన్న విషయాన్ని దేశ ప్రజలే నిర్ణయించాలన్నారు. దేశంలోనే కాదు..ప్రపంచ న్యాయ చరిత్రలోనే ఇలాంటి ఘట్టం చోటు చేసుకోలేదేమో.. సుప్రీంకోర్టులో పాలనా విధానం సరిగా లేదు.. జరగకూడని పరిణామాలు జరుగుతున్నాయి.. ఈ తీరును సరిదిద్దాలని ప్రధాన న్యాయమూర్తిని కోరాం.. కానీ ఆయనను ఒప్పించడంలో విఫలమయ్యాం అని చలమేశ్వర్ చెప్పారు.న్యాయ వ్యవస్థలో స్వేచ్చ లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. లోపాలను పరిష్కరించాలని కోరడం తప్పా అన్నరీతిలో ఈ న్యాయమూర్తులు మాట్లాడారు. పూర్తి వివరాలను వారు లేఖ రూపంలో మీడియాకు విడుదల చేశారు.

Related News