World / General
28 మంది.. 28 దేశాలు.. ఒక అబద్ధం!

తోడబుట్టిన వాళ్ళు, కవల పిల్లలు మాత్రమే ముఖకవళికల విషయంలో ఒకేలా కనిపించడం సాధారణ విషయం! ఒకరిని పోలినవారు ప్రపంచం మొత్తంమీద ఏడుగురు ఉంటారని మనం ఎప్పట్నుంచో వింటున్న మరో మాట. దాని తాలూకు రుజువులు కూడా అప్పుడప్పుడూ బయటపడిన దాఖలాలు కూడా వున్నాయి. కానీ.. ఒకే ముఖంతో వేర్వేరు దేశాల్లో 28 మంది ఉన్నారంటూ గ్రూప్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకంలో 8వ అద్భుతం అంటూ ప్రచారం జరుగుతున్న ఈ మాటలో మేటరెంత?

ఆసక్తికరంగా అనిపించే ఏ ఫోటో అయినా, వీడియో అయినా సోషల్ మీడియా వెబ్ సైట్ల ద్వారా వేగంగా స్ప్రెడ్ అవడం సహజం. కానీ.. వీటిలో ఏ వందో వంతు పోస్ట్ లు మాత్రమే వాస్తవాలు.. మిగతావన్నీ వదంతులే! ఇప్పుడీ 'ఎనిమిదవ అద్భుతం' కూడా అటువంటిదే! విచారించి చూస్తే.. ఈ ఫోటో, దీని డిస్క్రిప్షన్ జనవరి 13వ తేదీనే చెక్4స్పామ్ కు రిపోర్ట్ చేయడమైనది. అప్పట్లో బెంగుళూరు మిర్రర్ అనే వెబ్ సైట్ కూడా దీని బండారాన్ని బయటపెట్టేసింది! నిశితంగా పరిశీలిస్తే.. ఈ ఫోటో అసలు రంగును ఈజీగా పసిగట్టేయ్యొచ్చు. కుడిపక్కన చివర్లో చేతిలో రోజాపువ్వును పట్టుకున్న నీలం రంగు చొక్కా మనిషిని గమనిస్తే.. అతడి శరీరం రంగులో స్పష్టమైన తేడాను గుర్తించవచ్చు. 'ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్' ద్వారా ఈ ఫోటో మీద చేతివాటం జరిగినట్లు తేలిపోతుంది. సో.. ఏదో ఒక గ్రూప్ ఫోటోలోని 28 మంది మొహాలకు ఒకే మాస్క్ ని పేస్ట్ చేసి మాయ చేశారన్నది వాస్తవం! సో.. ఇది ఎయిత్ వండర్ కాదు.. జస్ట్ ఫోటోషాప్ వండర్!

 

Read Also

 
Related News