కర్రలతో చంపేశారు

తెలంగాణరాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లాలో ఎలుగుబంటిని చంపేశారు వ్యవసాయ కూలీలు. కెరిమెరి అటవీ ప్రాంతం శివారు లో మొరం నింపుతున్న కూలీల పై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటన లో ఇద్దరు వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కేకలు విన్న మిగతా కూలీలు ఒక్కసారిగా ఎలుగు పై కర్రలతో దాడికి దిగారు. పెద్ద పెద్ద కర్రలతో కూలీలంతా ఒక్కసారిగా కర్రలతో మోదడంతో ఎలుగు అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

READ ALSO

Related News