ఏపీలో మెడికల్ స్టూడెంట్ సూసైడ్ వెనుక

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ స్టూడెంట్స్ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పీజీ విద్యార్థిని శిల్ప ఆత్మహత్య కేసు  కొలిక్కి రాకముందే.. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాలలో మరో మెడికో సూసైడ్ చేసుకుంది. తిరుపతి శ్రీవేంకటేశ్వర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది 19 ఏళ్ల గీతిక. ఆదివారం సాయంత్రం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

కడప జిల్లాకు చెందిన హరితాదేవి కొన్నేళ్లుగా తిరుపతిలో వుంటున్నారు. కూతురు గీతిక ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు తన గదిలోకి వెళ్లింది. సాయంత్రం ఐదు అయినా బయటకు రాకపోవడంతో కుమార్తెని నిద్ర లేపేందుకు తలుపు తట్టింది గీతిక తల్లి. ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటీకి నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మెడికో చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు గీతిక సూసైడ్‌ నోట్‌ దొరికింది. ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది గీతిక. ఈ విషయం తల్లికి చెప్పి మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఈ విషయం ఇంట్లో చెప్పిన నుంచి గొడవలు మొదలయ్యాయి. పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన గీతిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. చనిపోయేముందు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగకుండా ఉండలేనని, జీవితంలో ఓడిపోతానని అనుకోలేదని, తనను క్షమించాలని లేఖలో పేర్కొంది.

READ ALSO

Related News