వారణాసిలో కుప్పకూలిన ఫ్లైఓవర్..18 మంది మృతి

వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోగా 18 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఫ్లై ఓవర్ కింద ఉన్న నాలుగు కార్లు, మినీ బస్సు, ఓ ఆటో మరికొన్ని వాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి.

శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. శిథిలాలను తొలగించేందుకు ఎనిమిది క్రేన్లను వాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు.

ఈ ప్రమాదంపై 48 గంటల్లోగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రమాదానికి కారకులైన ఉన్నతాధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ…బాధితులను వెంటనే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

READ ALSO

Related News