ఏవోబీలో కాల్పుల కలకలం, తప్పించుకున్న 100 మంది మావోలు

ఆంధ్ర- ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లోని మల్కన్‌గిరి జిల్లాలో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోల అగ్రనేతలు తప్పించుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న ఓ శిబిరాన్ని గ్రేహౌండ్స్‌ బలగాలు రౌండప్ చేయడంతో వెంటనే శిబిరాన్ని విడిచిపెట్టి పారిపోయినట్లు సమాచారం. ఏఓబీలో బుధవారం నుంచి ఆంధ్ర- ఒడిశాలకు చెందిన గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ మొదలుపెట్టాయి.

గురువారం ఉదయం దాదాపు 7 గంటల సమయంలో బలగాలు ఓ గ్రామానికి చేరుకోవడం గమనించిన మావోయిస్టుల సెంట్రీ పసిగట్టి వాళ్లపై కాల్పులు జరిపి తమ వాళ్లని అప్రమత్తం చేశాడు. ఈలోగా గ్రేహౌండ్స్‌ బలగాలు మావోయిస్టుల శిబిరాన్ని చుట్టుముట్టాయి. అప్పటికే మావోయిస్టులంతా శిబిరాన్ని విడిచినట్టు తెలిసింది. సుమారు 40కి పైగా కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విరసం, పౌరహక్కుల సంఘం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడా? లేక తప్పించుకున్నాడా? అంటూ ప్రొఫెసర్ హరగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన బతికే ఉంటే ఆ సమాచారాన్ని తక్షణం బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

READ ALSO

Related News