టీటీడీ ! ఏమిటిది ?

టీటీడీ బ్యాంకు డిపాజిట్లపై తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ వెయ్యి కోట్లు డిపాజిట్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలకవర్గం నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఈ సంస్థ నాలుగువేల కోట్ల నిధుల్లో మూడు వేల కోట్లను పలు జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయగా.. వెయ్యి కోట్లను ఇండస్ ఇండ్ అనే ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసింది. కాగా… ఈ కేసును పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. టీటీడీ ఈఓ, దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్, కమిషనర్, ఇండస్ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. ..

READ ALSO

Related News