చిక్కుల్లో బండ్ల బ్రదర్స్

నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మళ్ళీ చిక్కుల్లో పడ్డారు. బండ్ల గణేష్, అతడి సోదరుడు శివబాబు మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఫరూక్ నగర్ మండలం బూర్గులలో ఒక భూమి కొనుగోలు వివాదం ఈవిధంగా మలుపు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ కి చెందిన డాక్టర్‌ దిలీప్‌చంద్రకు ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల శివారులో భూములు, పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిని కొంటామని ఒప్పందం చేసుకున్న బండ్ల సోదరులు.. తర్వాత మోసం చేసినట్లు ఫిర్యాదు నమోదైంది.

ఒప్పందం ప్రకారం భూమి కొనుగోలు చేయకపోగా.. ఏమని అడిగితే బూతులు తిట్టి, దాడికి ప్రయత్నించారంటూ దిలీప్ దంపతులు కంప్లయింట్ చేశారు. దీంతో బండ్ల గణేష్‌, ఆయన సోదరుడు శివబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్‌ తెలిపారు. ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ.. చెక్ బౌన్స్ లాంటి అనేక కేసుల్లో చిక్కుకున్న బండ్ల గణేష్ కి ఇది మరో షాకింగ్ న్యూస్.

Related News